నేడు సమగ్ర శిక్ష ఉద్యోగుల ‘చలో విజయవాడ’

Jan 4,2024 22:07
నేడు సమగ్ర శిక్ష ఉద్యోగుల 'చలో విజయవాడ'

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె గురువారానికి 16వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట సమ్మెను కొనసాగించారు. చలో విజయవాడను జిల్లాలోని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు విల్వనాథం, శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

➡️