న్యూస్‌ ఛానల్స్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలను క్షుణంగా పరిశీలించాలి

Apr 2,2024 22:00
న్యూస్‌ ఛానల్స్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలను క్షుణంగా పరిశీలించాలి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వివిధ టీవీ ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణంగా పరిశీలించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్‌ లోని స్పందన హాల్‌ నందు ఏర్పాటు చేసిన యం సి య సి కేంద్రాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన అప్పటి నుంచి చిత్తూరు జిల్లాకు సంబంధించి వివిధ రకాల టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే ప్రకటనల నిమిత్తం ముందస్తుగా ఎంసిఎంసి కమిటీ ఆమోదం పొందాలని, పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రకటనలు నిమిత్తం నిర్ణిత ఫార్మట్‌లో తేదీ, సమయం, ఏ ఛానల్‌, ఏ పార్టీ వంటి వివరాలను తయారు చేసి యంసియంసి కమిటీ నోడల్‌ అధికారికి అందజేయాలన్నారు. కమిటీ పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేవరకు పెయిడ్‌ న్యూస్‌ని సంబంధిత పార్టీల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. నోటిఫికేషన్‌ వచ్చినా అనంతరం అభ్యర్థుల ఖాతాలకు జమ చేయాలని నోడల్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు. కమిటీ నోడల్‌ అధికారి బి.నాగేశ్వర రావు, సమాచార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️