పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Dec 19,2023 22:34
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ప్రజాశక్తి-వెదురుకుప్పం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వైఎస్సార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.అన్నపూర్ణ శారద అన్నారు. మంగళవారం వెదురుకుప్పం ఎన్‌.ఎస్‌.ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, పరిసరాలను శుభ్రంగా మార్చారు. కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, చెత్తను వేరు చేసి, పునర్వినియోగం చేయడంపై అవగాహన కల్పించారు. పాత టైర్లు, బాటిళ్లతో అందమైన పూలదొంతలు, కూర్చొనే ప్రదేశాలను తయారు చేశారు. కంపోస్ట్‌ పిట్లు తవ్వడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ కార్యక్రమాన్ని ప్రశంసించి, ఎన్‌.ఎస్‌.ఎస్‌ యూనిట్‌ కషిని అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ వి.ప్రభాకర్‌ రావు, డాక్టర్‌ సి.మంగళ గౌరీ, డాక్టర్‌ పి.వెంకటేశు, డి.లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ కె.శంకర్‌రెడ్డి, డాక్టర్‌ లావణ్యకుమారి, భరణినాధ్‌ రెడ్డి, డాక్టర్‌ పి.బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️