పిచ్చి కుక్క వీరంగం 50 మందిపై దాడి భయంతో పరుగులు

పిచ్చి కుక్క వీరంగం 50 మందిపై దాడి భయంతో పరుగులు

పిచ్చి కుక్క వీరంగం 50 మందిపై దాడి భయంతో పరుగులు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: వీధి కుక్కలు బాగా పెరిగి వీరవిహారం చేస్తున్నాయి. వద్ధులు, చిన్న పిల్లలు వీధుల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. చిత్తూరు నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ఫిర్యాదులు అందు తున్నా నగర పాలక సంస్థలో కదలిక లేదు. అడపా దడపా వీధి కుక్కలను అదుపు చేస్తున్నామని ఒకటి రెండు వార్డు ల్లో వీధి కుక్కలను పట్టుకొని తిరిగి వది లేస్తుండటంతో వీటి సంతతి బాగా పెరిగి పోతోంది. ఉదయాన్నే వ్యాయామం చేసేందుకు బయటకు రావాలన్నా పొద్దు పోయాక ఇంటి నుండి వీధుల్లోకి వచ్చేందుకు వద్ధులు, చిన్నపిల్లలు భయాందో ళనకు గురవుతున్నారు.50 మంది పై పిచ్చికుక్క దాడి స్థానిక 40,41,42 డివిజన్‌లో ఆదివారం 50 మందిపై పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ దాడిలో 50 మంది గాయ పడ్డారు. ఒకే రోజు పిచ్చికుక్క దాడిలో 50 మంది గాయపడ్డారనే వార్త నగరంలో వైరల్‌ అయింది. పిచ్చికుక్క దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిసిహెచ్‌ఎస్‌ నాయక్‌, నగర కమిషనర్‌ అరుణ పరామర్శించారు.వీధి కుక్కలను కట్టడి చేస్తాం.. వీధి కుక్కలను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని నగర కమిషనర్‌ అరుణ తెలిపారు. పిచ్చి కుక్క దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ వీధి కుక్కలను పట్టుకొని కుక్కల సంతతి పెరగకుండా ఆపరేషన్‌ చేసి తిరిగి యథాస్థానంలో వదిలేస్తున్నట్లు తెలిపారు. 40, 41, 42 డివిజన్‌లో ప్రజలను గాయపరిచిన పిచ్చికుక్కను పట్టుకునేందుకు పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కుక్క దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్యాధికారులను కోరారు. యుద్ధ ప్రాతిపదికన నగరంలో ఏఏ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉందో ఆ ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టి మంగాసముద్రం వద్ద ఏర్పాటు చేసిన కుక్కల షెడ్డుకు తరలిస్తామన్నారు.

➡️