పి.కొత్తకోట ఎస్సీ వెల్ఫేర్‌ బార్సు హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌

Feb 14,2024 21:31

ప్రజాశక్తి- ఐరాల: పూతలపట్టు మండలం పి.కొత్తకోట ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గహఅధికారిపై పలు ఫిర్యాదులు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌కి అందడంతో కలెక్టర్‌ వారి ఆదేశాలు మేరకు జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి రాజ్యలక్ష్మి పి.కొత్తకోట ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గహంను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గహం విద్యార్ధులను విచారించగా వాళ్ళకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, వసతి గహ అధికారి జి.సురేష్‌, సరిగా విధులకు హాజరు కావడం లేదని, మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, అక్కడ కాపలాదారుడిగా పనిచేస్తున్న వారు, వసతి గహ అధికారి విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిపారు. ఈ లోటుపాట్లు పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్‌ వసతి గహ అధికారి జి. సురేష్‌ను విధులను నుంచి సస్పెండ్‌ చేశారు.

➡️