‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి’

Jan 27,2024 22:23
'ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి'

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం… రక్షణ కల్పించండి.. అంటూ గుడిపాల మండలం నరహరిపేట పోస్ట్‌ వసంతాపురం పంచాయతీ చెరువు ముందర ఊరుకు చెందిన ఓ ప్రేమజంట శనివారం మీడియాను ఆశ్రయించింది. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కాంచన, భరత్‌కుమార్‌ ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వీరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు, పెద్దలు వీరి వివాహానికి అంగీకరించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. అమ్మాయి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు.

➡️