భోగిలో అంగన్‌వేడి

Jan 14,2024 21:38
భోగిలో అంగన్‌వేడి

ష మంటల్లో నోటీసులు దగ్ధం ష 34వ రోజూ సమ్మెష శిబిరాల్లో హోరెత్తిన నినాదాలుష గొబ్బెమ్మ పాటలతో ప్రభుత్వానికి నిరసనలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె ఆదివారం 34వ రోజుకి చేరింది. చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లి, పలమనేరు, కార్వేటినగరం, నగరి వరకు అన్ని ప్రాజెక్టు కార్యాలయం శిబిరాలు వద్ద భోగి పండుగ రోజు భోగిమంట వేసి నోటీసులను దగ్ధం చేసి గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు లలిత, జిల్లా కార్యదర్శి షకీలా, జిల్లా ఉపాధ్యక్షురాలు మమత, పంచవర్ణ , శ్యామల పద్మలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టిన అలుపెరుగని పోరాటం చేస్తున్న అంగన్వాడీలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబం మొత్తం ఆనందంగా భోగి పండుగ చేసుకోవాల్సిన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన శిబిరాల వద్ద అంగన్వాడీలు భోగి పండుగ చేసుకోవలసిన దుర్భిక్ష పరిస్థితికి తీసుకువచ్చింది. సంక్రాంతి, కనుమలు కూడా శిబిరాల వద్ద చేసుకుంటామని అప్పటికైనా ప్రభుత్వానికి సిగ్గు రావాలని అన్నారు. లక్ష పదివేల మంది మహిళలు రోడ్ల మీదే పండుగలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారని, ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వండి అని అడిగినందుకు మాకు తగిన బుద్ధి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కుటుంబం మొత్తం ఆనందంగా జరుపుకునే పండుగను అంగన్వాడీల కుటుంబాలను మాత్రం వీధులు పాలు చేసిన ఘనత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా పోరాటం ఉదతం కాకముందే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమాలలో ఆయా ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న అంగన్వాడీలు భోగి మంటలు వేసి ముగ్గుల రూపంలో సమస్యలు తెలియజేసి పోరాటాన్ని కొనసాగించారు.పండగ పూట కూడా పచ్చిపులుసే గతి..ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌సంక్రాంతి పండగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు నిరాశే మిగిల్చింది. జీతాలు పెంచకపోవడం పండగపూట అంగన్వాడీలు పస్తులతో గడపాల్సి వచ్చింది. అంగన్వాడీల పోరాటం నేడు ఆదివారానికి 34వ రోజుకు చేరుకుంది. మొన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో కోటి సంతకాలకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా భోగి పండుగ రోజున అంగన్వాడీ దీక్షా శిబిరం ముందు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి నగర ప్రధానకార్యదర్శి కే.వేణుగోపాల్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు 34 రోజులుగా పోరాడుతున్న పట్టించుకోని దుర్మార్గమైన ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కోటి సంతకాలే కాదు రెండు కోట్ల కైనా సంతకాలను సేకరించి ప్రజామద్దతుతో అంగన్వాడీల పోరాటం ప్రజా బహుళయమైన పోరాటంగా దీన్ని మారుస్తామన్నారు. సిఐటియు నాయకులు తంజావూర్‌ మురళి, అంగన్వాడీలు సుజిత, వరలక్ష్మి, ఎల్లమ్మ, గంగాదేవి సుశీలమ్మ, మల్లార్‌ కోడి, కల్పనా, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టిడిపి జనసేన నాయకులు ఆదివారం సంఘీభావం తెలియజేశారు. టిడిపి మహిళా విభాగం తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు చక్రాల ఉష, జనసేన నాయకులు అంజూరు చక్రధర్‌, సీఐటీయూ నాయకులు పెనగడం గురవయ్య, రేవతి పాల్గొన్నారు. రేణిగుంట మంచినీళ్ళ గుంట పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద ఆదివారం 34వ రోజు భోగి మంటల్లో ఎస్మా జీవో నెం .2, ఉద్యోగాల్లో చేరాలని ఇచ్చిన సోకాజ్‌ నోటీసులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. గూడూరు పట్టణంలోని అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్‌. ప్రభావతి, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, సిఐటియు నాయకులు భోగి మంటల్లో ఎస్మా కాపీలను, సోకాజ్‌ నోటీసులను వేసి నిరసన తెలిపారు. అలాగే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆదివారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పండగపూటలో మట్టి తిని బ్రతకాలా జగనన్న అంటూ అంగన్వాడీలు సమ్మె శిబిరం వద్ద మట్టి తింటూ నిరసన తెలిపారు. నాయుడుపేట ఐసిడిఎస్‌ వద్ద ఆదివారం అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి శివకవి, ముకుందా అంగనవాడి ప్రాజెక్టు కార్యదర్శి ఎన్‌.శ్యామలమ్మ పాల్గొన్నారు.

➡️