మరుదు పాండ్యన్‌ సోదరులు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

Jan 22,2024 22:42
మరుదు పాండ్యన్‌ సోదరులు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్థానిక చిత్తూరు – వేల్లూరు రోడ్‌, రిలయన్స్‌ మార్ట్‌ సూపర్‌స్టోర్‌ ఎదురుగా, గంగినేని చెరువు వద్ద, మరుదు పాండియార్స్‌ మెమోరియల్‌ పార్క్‌ ప్రధానపూజ, టిజి.బుల్లెట్‌ సురేష్‌ కషితో విగ్రహ ఏర్పాటుకు సోమవారం భూమిపూజ చేశారు. ఈకార్యక్రమంలో మామన్నన్‌ మరుదు పాండియార్స్‌ వారసులు రామస్వామి, నగర మేయర్‌ అముద, కమిషనర్‌ అరుణ, చుడా చైర్మన్‌ పురుషోత్తమరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాహుల్‌ రెడ్డి, మొదలియార్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మొదలియార్‌, మొదలియార్‌ వెల్ఫేర్‌ బోర్డు సభ్యులు గుణశేఖరన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మొదిలియర్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ బుల్లెట్‌ సురేష్‌ మాట్లాడుతూ చిత్తూరులో స్వాతంత్ర సమరయోధులు మరుదు ప్యాండియన్‌ సోదరుల విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటీష్‌ వాళ్ళును ఎదురించి ఊరితీయబడ్డ యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడం నేటి యువతలో స్వాతంత్ర సూర్తిని నింపేలా ఉంటుందన్నారు.

➡️