ముగిసిన ఃఆడుదాం ఆంధ్రః జిల్లాస్థాయి పోటీలు

ముగిసిన ఃఆడుదాం ఆంధ్రః జిల్లాస్థాయి పోటీలు

ముగిసిన ఃఆడుదాం ఆంధ్రః జిల్లాస్థాయి పోటీలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, క్రీడాప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ఆటలపోటీల ద్వారా వెలికి తీస్తున్నదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం చిత్తూరులోని మెసానికల్‌ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు విచ్చేయగా, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌ పర్సన్‌ రమ్య, ఐసిడిఎస్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ శైలజా రెడ్డి, జడ్పీ మహిళా స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భారతి, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. జేసి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఆడుదాంఆంధ్ర పోటీలకు ఎంపిక కాబడ్డ క్రీడాకారులను అభినందించారు. ఈనెల 9 నుండి 13వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగు రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్రలో గల క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బాడ్మింటన్‌ వంటి 5 క్రీడలలో పోటీలలో చిత్తూరు జిల్లా పేరు నిలబెడుతూ పోటీలలో రాణించి ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు పొందాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డ క్రీడాకారులకు జిల్లా నుండి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈనెల 7వ తేదీన విశాఖపట్నంకు ప్రత్యేక బస్సులలో తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు. వారికి అవసరమైన వసతి, తదితర ఏర్పాట్లు అన్ని చేయడం జరిగిందన్నారు. జిల్లా స్పోర్ట్స్‌ అధికారి బాలాజీ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీదేవి, చిత్తూరు ఆర్‌డిఓ చిన్నయ్య, పిఈటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️