మురిసిన త్రివర్ణం

Jan 27,2024 00:01

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅథితిగా విచ్చేసిన కలెక్టర్‌కు జిల్లా ఎస్పి రిశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ 9.10గం.లకు జాతీయ పతాక ఆవిష్కరించారు. పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్‌ జిల్లా ఎస్పితో కలసి పోలీస్‌పెరేడ్‌ను పరిశీలించారు. పెరేడ్‌ పరిశీలన అనంతరం జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి సాధించిన ప్రగతిని ప్రసంగం రూపంలో చదివి వినిపించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన, తదుపరి విద్యాశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, ఉత్తమ సేవలందించిన అధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ అవార్డుల ప్రదానం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు పరిశీలన అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప, జెడ్పీ ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావ్‌, జేసి శ్రీనివాసులు, డిఎఫ్‌ఓ చైతన్య కుమార్‌ రెడ్డి, నగర మేయర్‌ అముద, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డా.ఐ.కరుణకుమార్‌, మూడవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.శ్రీనివాస్‌, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, జెడ్పి వైస్‌ ఛైర్మన్‌ రమ్య, అడిషనల్‌ ఎస్పి సుధాకర్‌, శ్రీలక్ష్మీ, నాగేశ్వరరావు, జెడ్‌పి సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.చిన్నారి ప్రసంగం.. కలెక్టర్‌ అభినందన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి ఉట్టి పడేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. దీనితోపాటు గాబ్రియల్‌ పాఠశాలలో రెండవ తరగతి చదివే విద్యార్థి అమీనా గణతంత్ర దినోత్సవంనకు సంబంధించి ఇంగ్లీషులో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చిన్నారిని అభినందిస్తూ మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు వీరగాథ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వకత్వ, పెయింటింగ్‌, పద్యాల పోటీలలో గెలుపొందిన నలుగురు విద్యార్థులకు రూ.2వేలు నగదు బహుమతితో పాటు మెమెంటోను అందజేశారు. ఈ పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది.రూ.1897 కోట్ల చెక్కు పంపిణీ ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంబంధించి రూ.1897కోట్ల ఆస్తులను కలెక్టర్‌ షన్మోహన్‌ పంపిణీ చేశారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌గ్రౌండ్‌లో డిఆర్డిఏ ద్వారా బ్యాంక్‌ లింకేజీ కింద 15,060 ఎస్‌హెచ్‌జిలకు రూ.1429కోట్లు, స్త్రీనిధి కింద 28,067 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు రూ.186 కోట్లు మొత్తం రూ.1,615 కోట్ల మెగా చెక్కును, మెప్మా ద్వారా బ్యాంక్‌ లింకేజీ కింద 1,921 ఎస్‌హెచ్‌జిలకు రూ.281కోట్ల మెగా చెక్కును, విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా 10మంది లబ్ధిదారులకు రూ.1.74లక్షలతో ల్యాప్‌ టాప్‌, ట్రై సైకిల్‌లు, వీల్‌ చైర్‌లను మొత్తం రూ.1,897కోట్ల ఆస్తులను మెగా చెక్కుల రూపంలో కలెక్టర్‌ పంపిణీ చేశారు.

➡️