రైతుల ఆశలు ఆవిరి.. అప్పుల అగాథంలో ఆక్రందని కానరాని పూత నిలువునా ముంచిన మామిడి ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం

రైతుల ఆశలు ఆవిరి.. అప్పుల అగాథంలో ఆక్రందని కానరాని పూత నిలువునా ముంచిన మామిడి ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం

రైతుల ఆశలు ఆవిరి.. అప్పుల అగాథంలో ఆక్రందని కానరాని పూత నిలువునా ముంచిన మామిడి ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యంప్రజాశక్తి – వెదురుకుప్పం: ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా మామిడి పంట పూత పూర్తిగా కనుమరుగైంది. దీంతో రైతులు మామిడి పంటపై పెట్టిన పెట్టుబడి ఆవిరై అప్పుల అగాథంలో కూరుకుపోయారు. రైతుల ఆశలు అడుగంటాయి. అప్పుల అగాథంలో కూరుకుపోయి ఆక్రందనలు పెడుతున్నారు. ఎలా బయటపడాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి పంటలో నవంబరు చివరి వారం నుంచి మామిడి పంటపై క్రిమి సంహారిక మందులను రైతులు పిచికారి చేస్తారు. వివిధ చీడ పీడల నివారణకు ఈ మందులను మామిడి కాయల మండి వ్యాపారుల వద్ద, మందుల దుకాణాల నుంచి రైతులు కొనుగోలు చేస్తారు. మరి కొంత మంది రైతులు మామిడి కాయల మండి వ్యాపారుల నుంచి క్రిమి సంహారిక మందులు అప్పు తెచ్చుకుంటారు. పంట దిగుబడి వస్తే ఆ మండి యజమానికి మామిడి కాయలు పంపి అప్పు జమ చేసి మిగిలిన సొమ్మును తీసుకుంటారు. మరి కొంత మంది రైతులు ధనవంతుల వద్ద అప్పు తెచ్చుకుని షాపులలో క్రిమి సంహారక మందులు తెచ్చుకుని పిచికారీ చేస్తారు. దీంతో పంట దిగుబడి పెరిగి ఆశాజనకంగా వుండేది. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మామిడి చెట్లలో పూత పూర్తిగా కనిపించకపోవడంతో రైతులు దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం మండలంలో 2,300 ఎకరాలు పంట సాగుచేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి 75 శాతం తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఎటు చూసినా మామిడి పంటలో పూత కాన రాలేదు. మామిడి చెట్లకు మొత్తం విగురులు వచ్చాయి. దీంతో రైతులు క్రిమిసంహారక మందులకే చేసిన అప్పులే మిగిలాయి. ఎంత యత్నించినా మామిడి దిగుబడి ఆశాజనకంగా రావడంలేదు.ఈసారి మామిడి పంట లేదు ఈ సంవత్సరం మామిడి పంట పూర్తిగా రైతులను దెబ్బ తీసింది. గత సంవత్సరమైనా కొద్దోగొప్పో పండేది. ఈ సారి మామిడి పంట పూర్తిగా లేదు. మామిడి చెట్లలో బంక రోగం అధికంగా ఉంది . చెట్లపై నుండి జిగట కారుతోంది. ఏమి చేయాలో అర్థం కాలేదు. – గుణశేఖర్‌ నాయుడు , పిల్లిగుండ్లపల్లి మామిడి రైతు, ఎస్‌ఆర్‌పురం మండలం. వాతావరణంలో మార్పులు ఉంటే పూతల్లో మార్పులు ఉంటాయి.. మామిడి పూత చాలావరకు వాతావరణ పరిస్థితుల పైన, రైతులు చేపట్టే ఎరువులు, యాజమాన్యం చర్యలు పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జూలె,ౖ ఆగస్టు నెలలో మామిడి చెట్లకు వచ్చిన ఇగురులు ముదిరి రెమ్మల్లో పూత డిసెంబర్‌ చివరి వారంలో లేదా జనవరి మాసంలో వస్తుంది. మామిడి పూతలు రావడానికి ముందు రెండు నెలలు బెట్ట పరిస్థితులు అవసరం. డిసెంబర్‌లో సగటు ఉష్ణోగ్రత 18 -23 సెంటిగ్రేడ్‌, రాత్రిపూట 10 -13 సెంటిగ్రేడ్‌ వుంటేనే పూత రావడానికి అను కూలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తేడాలు వస్తే పూతా రావడంలో మార్పులు ఉంటాయి. పూతకు ముందు రెండు నెలలు తోటలకు నీటి తడులు ఇవ్వడం పూర్తిగా నిలిపివేయాలి. నవంబర,్‌ డిసెంబర్‌లో చలి వాతావరణం మరి ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వు మొగ్గలు రావడం ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు పూమొగ్గలను ఉత్తేజపరిచేందుకు డిసెంబర్‌ రెండవ పక్షంలో లీటరు నీటికి10 గ్రాములు మల్టీకే పొటాషియం నట్రైట్‌ ఐదు గ్రాములు, యూరియా చొప్పున కలిపి చెట్లపై రెమ్మలు భాగంలో పిచికారి చేయాలి. యూరియా మళ్లీ కేలోని నత్రజని ఫొటోస్‌ పోషకాలు కలిపి పూ మొగ్గలను ఉత్తేజ పరిస్తే బాగా పూత రావడానికి అధికంగా అవకాశం వుంటుంది. పిండి కట్టడానికి, కాయలులో జ్ఞానం ఎదగడానికి సహకరిస్తుంది. పూతను అసలు ఎక్కువగా బూడిద రంగు తెగులు ఆశిస్తుంది. లేత ఆకులు, కాండం పూల మీద, చిరు పిందెల మీద, తెల్లని పౌడర్‌ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు.. ఇది ఎక్కువగా రాత్రి పూట చల్లగా, పగులు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాయ రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి మూడు గ్రాముల గంధకం కలిపి పిచికారి చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హై క్యాబ్కోనజోల్‌ రెండు మిల్లిలీటర్లు, లేదా డినోకాప్‌ లేదా ట్రై మాల్స్‌ కలిపి ఒక మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.్ణ రైతులు సకాలంలో స్పందించి మామిడి సంరక్షణ యాజమాన్యం పాటిస్తే ఫలితాలు అధికంగా ఉంటాయి.- లోకేష్‌ , ఉద్యానవన శాఖ అధికారి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం.

➡️