‘స్పందన’కు 277 అర్జీలు

Jan 29,2024 22:16
'స్పందన'కు 277 అర్జీలు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలోమొత్తం 277 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 243, జిల్లా విద్యాశాఖ 4, పోలీసు శాఖ 2, ఆర్‌డబ్ల్యూఎస్‌ 1, మున్సిపల్‌ శాఖ 5, డిఆర్‌డిఏ 9, జిల్లా ఉపాధి కల్పన 2, డ్వామా 1, ఏపిఎస్‌పిడిసిఎల్‌ 2, జిల్లా పరిషత్‌ 3, డిసిహెచ్‌ఎస్‌ 2, హౌసింగ్‌ 1, సోషల్‌ వెల్ఫేర్‌ 1, ఇతరులు 1 మొత్తం 277 అర్జీలను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు డిఆర్‌ఓకు అందజేశారు.

➡️