20వ డివిజన్‌ అభివృద్ధికి ఐఓసి ఆర్థిక సాయం

20వ డివిజన్‌ అభివృద్ధికి ఐఓసి ఆర్థిక సాయం

20వ డివిజన్‌ అభివృద్ధికి ఐఓసి ఆర్థిక సాయం ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: స్థానిక ఇరువారం స్లవమ్‌ ఏరియాలో కమ్యూనిటి హాలు, డ్రైనేజి వ్యవస్థ అధ్వానంగా ఉందని 20వ వార్డు కార్పొరేటర్‌ కే.అశోక్‌ ఐఓసి సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ , ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ తివారీ కి వినతి పత్రం అందించారు. చిత్తూరు నగరంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ క్వార్టర్స్‌ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఓసి సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ , ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ తివారీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ మాట్లాడుతూ ఇరువారంలోరి ప్రజలు డ్రైనేజి పైపులైను, కమ్యూనిటి హాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో స్పందించిన సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ తివారీ సానుకూలంగా స్పందించి ఈసిఎల్‌ ఫండ్స్‌ వినియోగం పై ఎస్టిమేషన్‌ వేసి ఇవ్వాలని చిత్తూరు నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న ఐఓసిల్‌ వారికి వార్డు తరపున కార్పొరేటర్‌ అశోక్‌ హదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవర్ధన్‌, ఎంఈ అసిస్టంట్‌ సిటీ ప్లానర్‌ రామకష్ణ, పారస్ట్‌ డిఎఫ్‌ఒ, ఐఓసిల్‌ సీనియర్‌ మెనేజర్‌ బాలమురుగన్‌, ఐఓసిల్‌ జూనియర్‌ మెనేజర్‌ రఘువంశి ఇరువారం ప్రజలు పాల్గొన్నారు.

➡️