26న కుప్పంకు సిఎం రాక

Feb 19,2024 21:59
26న కుప్పంకు సిఎం రాక

శాంతిపురంలో బహిరంగ సభఏర్పాట్లపై అధికారులతో సమావేశంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో జరుగునున్న బహిరంగ సభలో పాల్గొనున్నారని, ఈ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, శాంతిపురం మండలం పర్యటనకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించి ఎటువంటి చిన్నచిన్న పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖల వారీగా కేటాయించిన విధులు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ బి.పుల్లయ్య, డ్వామా పిడి ఎన్‌.రాజశేఖర్‌, జెడ్పి సిఈఓ ప్రభాకరరెడ్డి, డిఆర్‌డిఎ, హౌసింగ్‌, మెప్మా పిడిలు తులసి, పద్మనాభం, రాధమ్మ, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ప్రభావతీ దేవి, డీఈఓ దేవరాజులు, పిఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌ అండ్‌బి ఎస్‌ఈలు చంద్రశేఖర్‌ రెడ్డి, విజరుకుమార్‌, ఉమా మహేశ్వరరెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ శివయ్య, సమగ్రశిక్ష ఎపిసి వెంకటరమణరెడ్డి, సాంఘిక, బిసి సంక్షేమశాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బాని బాష, డిపిఓ లక్ష్మి, సీపీఓ సాంబశివ రెడ్డి, ట్రాన్స్కో ఈఈ శ్రీహరి, జిల్లా ఐసిడిఎస్‌ అధికారి నాగశైలజ, డిఎల్‌డిఓ రవికుమార్‌, కలెక్టరేట్‌ ఏఓ వెంకటేశ్వర్లు, డిఎస్పీ సుధాకర్‌ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

➡️