నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా..

Jun 16,2024 20:49
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా..

గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ థామస్‌
ప్రజాశక్తి-కార్వేటినగరం, వెదురుకుప్పం: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేేస్తానని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ థామస్‌ అన్నారు. ఆదివారం ఆయన కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో పర్యటించారు. ముందుగా ఆయనకు టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై అత్యధిక మెజారిటీతో గెలుపొందడంపై ఆనందాన్ని పంచుకున్నారు. జనసేన నేత పొన్న యుగంధర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. విజయం తరువాత ఎమ్మెల్యే తొలిసారి పర్యటనకు రావడంతో ఆయన్ను కలిసేందుకు కార్యకర్తలు ఉత్సాహపడ్డారు. ఈ సందర్భంగా శ్రేణులనుద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. నిత్యం నియోజకవర్గంలో ప్రజలను అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తానని స్పష్టం చేశారు. ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించినందుకు కృతజ్ఞతా భావంతో అభివృద్థి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️