ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి: కలెక్టర్‌

ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి: కలెక్టర్‌

ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి: కలెక్టర్‌ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: సాధారణ ఎన్నికలు 2024లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను రికన్సిలేషన్‌ కొరకు ఈ నెల 3వ తేదీ లోపు సమర్పించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 25-చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు శంకర్‌ప్రసాద్‌ శర్మ, పుంగనూరు, నగరి, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్‌ ఖన్నా, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు రోహన్‌ ఠాకూర్‌లతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన 26వ రోజున అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాల రికన్సిలేషన్‌ సమావేశంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రికన్సిలేషన్‌ ప్రక్రియకు అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా ఖర్చు వివరాలను తెలపని వారు ఈ నెల 3వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. ఈ ఖర్చు వివరాలను ఆన్‌ లైన్‌ పోర్టల్‌ లో అప్‌ లోడ్‌ చేయవలసి ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా సమర్పించాలన్నారు. ఈ సమావేశానికి డిఏఓ కష్ణారెడ్డి, ఎన్నికల అభ్యర్థుల తరఫున ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️