డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో

డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో

డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వోప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: డెంగీ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రభావతి అన్నారు. సోమవారం స్థానిక పిసిఆర్‌ హైస్కూల్‌లో ”డెంగు నివారణ మాసోత్సవం”పై ర్యాలీ లాంచనంగా ప్రారంభించారు. డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దోమలు పుట్టకుండా చూడాలన్నారు. నీటి నిల్వలు ఉన్నచోట మంచినీరు, వాన నీటిలో డెంగీ కారకక్రిమి టైగర్‌ దోమ పెరుగుతుందన్నారు. ప్రజలు ప్రతివారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అందరూ నిర్వహిస్తే నీటి నిల్వలు ఉండవు లార్వాలు పుట్టవు అని వివరించారు. ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాల ద్వారా విపులంగా అవగాహన కల్పించి డెంగీ నుంచి అందరూ కాపాడుకొని ఆరోగ్యంగా ఉందామని తెలిపారు. మలేరియా అధికారి శ్రీనివాసులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️