చెత్తా చెదారం.. దుర్వాసన

Jun 16,2024 20:44
చెత్తా చెదారం.. దుర్వాసన

ప్రజాశక్తి-పూతలపట్టు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు కుళ్ళిన చెత్తాచెదారం పేరుకుపోయి భరించలేని దుర్వా సన వెదజల్లుతోంది. దీంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చి పోవు ప్రజలు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మార్గంలో నాలుగు గ్రామాలకు వెళ్లే ప్రజలు రోడ్డుపై కూలిన చెత్త దుర్వాసనతో ముక్కులు మూసుకుని పోవా ల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న కాలనీవాసులు చెత్తాచెదారాన్ని ఆసుపత్రి ముందు పడేయడంతో ఈ దుస్థితి నెలకొంది. పంచాయతీ సిబ్బంది రోజులు తరబడి ఉన్న చెత్తను శుభ్రం చేయడం లేదని ఈ మార్గంలో వచ్చి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని చెత్తను శుభ్రం చేయాలని కోరుతున్నారు.

➡️