ఏనుగు దాడిలో వ్యక్తి మృతి మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయంసంఘటనా స్థలాన్ని పరిశీలించిన కుప్పం డిఎస్పి శ్రీనాథ్‌, అటవీ శాఖ రేంజర్‌ జయశంకర్‌

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయంసంఘటనా స్థలాన్ని పరిశీలించిన కుప్పం డిఎస్పి శ్రీనాథ్‌, అటవీ శాఖ రేంజర్‌ జయశంకర్‌

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయంసంఘటనా స్థలాన్ని పరిశీలించిన కుప్పం డిఎస్పి శ్రీనాథ్‌, అటవీ శాఖ రేంజర్‌ జయశంకర్‌ప్రజాశక్తి – రామకుప్పం :మండల పరిధిలోని పంద్యాల మడుగు పంచాయతీ, పులిమడుగు తాండ గ్రామశివార్లలో ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి మతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి పులిమడుగు తాండ గ్రామానికి చెందిన కన్నా నాయక్‌ (70) గ్రామం నుంచి కొత్తూరు తండాకు వెళ్లే దారిలో ఉన్న పశువుల షెడ్డు వద్దకు వెళ్లాడు.. అక్కడి నుంచి ప్రధానరోడ్డు మార్గంలో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఒంటరి ఏనుగు అతనిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సౌందర్య నాయక్‌కు చెందిన టమోటా తోటలో మేతకు సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఆగ్రహంతో ఒక్కసారిగా కన్నా నాయక్‌ మీదకు వచ్చి కింకారాలతో అతనిపై దాడి చేసి పొర్లించి తొండంతో అతన్ని విసిరింది. ఏనుగు కీంకారాలు విన్న మృతుని బంధువులు, స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కన్నా నాయక్‌ మతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇతను వ్యవసాయ కూలిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. షెడ్డు వద్ద పశువులను చూసి రావడానికి వెళ్లి ఏనుగు దాడిలో మరణించాడు. దాడికి ముందు కష్ణా నాయక్‌కు చెందిన అరటితోటలో ఒంటరి ఏనుగు తిన్నంత తిని, తొక్కి ధ్వంసం చేసింది. ఆదివారం ఉదయం కుప్పం డిఎస్పి శ్రీనాథ్‌, అటవీ శాఖ రేంజర్‌ జయశంకర్‌ ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఒంటరి ఏనుగు దాడిపై ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. మతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మతుని కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆనంద రెడ్డి, జిల్లా డిఎఫ్‌ఓ చైతన్య కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం అటవీ సరిహద్దుల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో సీఐ ఈశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఐ శివకుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️