క్రీడా మైదానాలేవీ..?శ్రీ శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం కరువు భలే.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు దూరంగా విద్యార్థులు

క్రీడా మైదానాలేవీ..?శ్రీ శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం కరువుశ్రీ భలే.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు దూరంగా విద్యార్థులు

క్రీడా మైదానాలేవీ..?శ్రీ శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం కరువుశ్రీ భలే.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు దూరంగా విద్యార్థులు ప్రజాశక్తి- పూతలపట్టు: అన్ని రంగాల్లో గ్రామీణ విద్యార్థులు ప్రతిభ చాటాలని.. గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో రాణించాలని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకు అవసరమైన వసతులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం చొరవ చూపించడం లేదు. సరైన క్రీడా మైదానాలు.. ఆడుకోవడానికి సరైన క్రీడా పరికరాలు లేక విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కావాల్సి వస్తోంది. క్రీడలపై మక్కువ ఉన్న విద్యార్థులు ఉన్న అరకొర వసతులతో రాణించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. క్రీడల వలన విద్యార్థుల్లో మానసికల్లాసం, శారీరక దఢత్వం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఇష్టమున్నా తగిన వసతులు లేకపోవడంతో తమ ఆశయాన్ని నీరు కాల్చుకోవాల్సి వస్తోంది. గురువులు ఉన్నా లేనట్టే..కొన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలు, తగిన పరికరాలు లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో క్రీడా గురువులు ఉన్న లేనట్టుగానే ఉంది. ఉదయం ప్రార్థన మందిరంలో విద్యార్థులను వరుస క్రమంలో నిలబెట్టడం.. పాఠశాలల్లో ఇతర పనులకు మాత్రమే క్రీడాగురువులు పరిమితమవుతున్నారు. విద్యాశాఖ ప్రమాణాల ప్రకారం ప్రతి ఉన్నత పాఠశాలకు కనీసం ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగినాటస్థలం ఉండాలి. కానీ ఎక్కడ ఈ పరిస్థితి కనిపించడం లేదు. కొన్నిచోట్ల పాఠశాలకు సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో ఉపాధ్యాయులు దాతలు సహాయంతో క్రీడా పరికరాలను అరకొరాగా సమకూర్చుకుంటున్నారు.మండలంలో పరిస్థితి…పూతలపట్టు మండలంలో మొత్తం 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాయి. ఇందులో తొమ్మిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత, 52 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో కూడా క్రీడా మైదానాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ఉన్న అరకొర మైదానాలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. మరికొన్ని క్రీడా మైదానాలు అయితే పిచ్చి మొక్కలతో నిండుకొని విద్యార్థులకు ఉపయోగకరంగా లేవు. ఇకనైనా అధికారులు తగిన చొరవతీసుకొని విద్యార్థులకు అవసరమైన క్రీడా మైదానాలు, పరికరాలు సమకూర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️