దురాక్రమణలో పాలారు నది – కుచించుకుపోతున్న పరివాహక ప్రాంతం

దురాక్రమణలో పాలారు నది - కుచించుకుపోతున్న పరివాహక ప్రాంతం

దురాక్రమణలో పాలారు నది – కుచించుకుపోతున్న పరివాహక ప్రాంతం ప్రజాశక్తి- శాంతిపురం: మండల కేంద్రంలోని పాలారు నది భూఆక్రమణదారుల చేతిలో దురాక్రమణకు గురవుతోంది. పాలారు నది పరివాహక ప్రాంతానికి ఇరువైపులా ఉన్న భూమిని కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంతో నీరు ప్రవహించే ప్రాంతం రోజురోజుకు కుచించుకుపోతుంది. ఇటీవల ఓ వ్యక్తి పాలారు బ్రిడ్జి పక్కన ఉన్న చెక్‌డాం వద్ద తన స్థలంలో ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని పాలారు నదిలోకి మట్టిని తోలి రీవిట్మెంట్‌ కట్టి ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా పాత ఆర్‌ అండ్‌ బి రోడ్డును కూడా తన స్థలంలోకి కలుపుకున్నాడు. మరోవైపు కొంతమంది పాత ఆర్‌ అండ్‌ బి రోడ్డును ఆక్రమించుకొని ఏకంగా భవనాలే నిర్మించేశారు. దీంతో నీరు పాలారి నదిలోకి ప్రవేశించడానికి దారి పూర్తిగా మూసుకుపోయింది. ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పాలారు నది ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️