ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం

Feb 19,2024 15:15 #Chittoor District
  • ఫొటోగ్రాఫర్ పై దాడి దారుణం
  • మాజీ మంత్రి అమర్

ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు జిల్లా) :  వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభపై స్పందించిన ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైకాపా నేతలు చేసిన దాడి దారుణమని ఇది జర్నలిజంపై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ఏ ఊరుకెళ్లినా వైసీపీ పాలనలోని 5 ఏళ్ల విధ్వంసం కనిపిస్తోందని, వందల కోట్లు ఖర్చు చేస్తూ…. అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారని తెలిపారు. జగన్ నోటి నుంచి వచ్చేవి అన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలే అన్నారు.

➡️