కాటేస్తున్న కల్తీ మద్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచితికిపోతున్న చిన్న కుటుంబాలు

కాటేస్తున్న కల్తీ మద్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచితికిపోతున్న చిన్న కుటుంబాలుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: కష్టజీవులు రోజంతా పని చేసి సాయంత్రానికి ఊరటకోసం కాస్త మందేస్తే ప్రస్తుతం మద్యం షాపుల్లో అమ్ముతున్న కల్తీ బ్రాండ్‌లతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచినా క్యాలిటీ విషయంలో ప్రమాణాలు పాటించకపోవడంతో జేబులు ఖాళీ కావడంతో పాటు కుటుంబాలు చితికిపోతున్నాయి. చీప్‌ లిక్కర్‌ క్వాటర్‌ కొనుగోలు చేయాలన్నా.. రూ.150 వెచ్చించాల్సి వస్తోంది. ఇలా తీసుకుంటున్న మద్యం క్వాలిటీ విషయం తెలియని పరిస్థితి. నాశిరకం మద్యం సేవించడం వల్ల రోజుకు 40 నుంచి 50మంది కాలేయం దెబ్బతిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని గ్యాస్ట్రా ఎంట్రాలజీ విభాగంలో ఏటా రెండు వేలు ఓపిలు చూడాల్సి ఉంటుంది. అయితే ఏడాదికి నాలుగు వేలకు పైగా కాలేయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్న వారిలో ఎక్కువశాతం యువకులే ఉంటున్నారు. ఎక్కువ కాలంగా మద్యం సేవిస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కాలేయ సమస్యలోస్తున్నట్లు మద్యం సేవించి కాలేయవ్యాధితో బాధపడుతున్నవారు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పాడుతున్నట్లు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ రోజుకు 48గంటల ముందు మద్యం విక్రయాలను ఆపేసి మద్యం షాపులను సీజ్‌ చేశారు. సోమవారం ఎన్నికలు జరిగితే శుక్రవారం జిల్లాలో కోటీ 30లక్షలకు పైగా మద్యం దుకాణాల్లో వ్యాపారం జరిగింది. ఎన్నికల సందర్భంగా కర్నాటక, గోవా మద్యం పోలీసుల కళ్ళుగప్పి గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ సాగింది. ఎన్నికల ముందు రోజు వరకు జిల్లా వ్యాప్తంగా 514మందిపై అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 8,300మద్యం స్వాదీనం చేసుకున్నారంటే పోలీసులకు తెలియకుండా అక్రమ మద్యం జిల్లాలో ఏ స్థాయిలో ఏరులైపారిందో అర్ధంమవుతోందని విశ్లేషకులంటున్నారు. బంగారుపాళ్యంలో అక్రమంగా తరలిస్తున్న కంటైనర్‌ మద్యం పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్వేటినగరంలో 432అక్రమ మద్యం బాటిల్స్‌ స్వాదీనం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాలో అక్రమ మద్యం కేసులున్నాయి. కర్ణాటక టెట్రాప్యాకెట్లు పోరుగు రాష్ట్రం కర్నాటక నుంచి టెట్రా ప్యాకెట్లు జిల్లాలో చాటుమాటుగా విక్రయిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీటి అమ్మకాలు జోరుగా సాగాయనే చెప్పాలి. ఏపి మద్యం సీసా కొనుగోలు చేయాలంటే రూ.150 వెచ్చించాలి. కర్నాటక మద్యం టెట్రా ఫ్యాకెట్‌కు రూ.40 వెచ్చిస్తే సరిపోతుంది. కొందరు కర్నాటక నుంచి అక్రమ మార్గంలో చిత్తూరు జిల్లా సరిహద్దు కావడంతో జిల్లాలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతలుండటంతో పోలీసులకు కూడా చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహలో గోవా నుంచి అక్రమ మార్గంలో మద్యం తరలించి జిల్లాలో ఓటర్లకు ఎరవేశారు. జిల్లాలో అక్కడక్కడా గోవా మద్యం పట్టుబడింది. దినసరి కూలీలు బలి తాగే అలవాటున్న వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలు, శారీరక శ్రమ చేస్తూన బతికేవారే మద్యం తాగడంతో వారిలో నిష్సత్తువ, నీరసం అవహించడం, కళ్ళు, చేతులు వణకడం, ఆయసంతో గతంలో మాదిరి శ్రమించలేకపోతున్నారు. ఫలితంగా ఇలాంటి ఆదాయం తగ్గిపోతోంది. రోజు మద్యం సేవిస్తున్న వారు సత్తువ కొల్పొయి నెలలో 10 నుంచి 15 రోజులు దినసరి కూలీ పనులు చేయలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో క్వాలిటీ మద్యం ఓ ప్రధాన చర్చగా సాగింది. అధికార పార్టీ నాశిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీస్తోందంటూ ప్రతిపక్ష పార్టీ నిప్పులు చెరిగింది. తాము అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అమ్మకాలతో పాటు మద్యం ధరలు తగ్గిస్తామంటోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ఆర్థిక విభాగంలో ఎక్సజ్‌ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయనిదే అగ్రభాగం కావడంతో ఏపార్టీ సంపూర్ణ మద్య నిషేదం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది.

➡️