కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

May 4,2024 21:26

ప్రజాశక్తి-తెర్లాం : మండలంలోని టెక్కలివలస, కాగాం, నెమలాం గ్రామాల్లో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరిపి విద్యాసాగర్‌ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి వైసిపి, టిడిపి వైఫల్యాల వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు, తెర్లాం మండల అధ్యక్షులు పొందూరు రవీంద్ర, నాలుగు మండలాల అధ్యక్షులు పత్రి రాజు, రాంబార్కి రామకృష్ణ, రాజాన అప్పలనాయుడు, రాయి రామారావు, తదితరులు పాల్గొన్నారు.వేపాడ, కొత్తవలస : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గేదెల తిరుపతి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కొత్తవలస మండలంలోని పాతసుంకరపాలెం, ఎర్రవానిపాలెం, బలిఘట్టం, వేపాడ మండలంలోని బక్కునాయుడుపేట, రాయుడుపేట గ్రామాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మేనిఫెస్టోలోని 9 అంశాలను తూచ తప్పక అమలు చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్తవలస మండల అధ్యక్షులు పాత్రుడు, నాయకులు పూడి శ్రీనివాసరావు, గోపి, అప్పారావు, సత్యారావు, బోని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.గెలుపునకు సహకరించండివిజయనగరం కోట: కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన గెలపునకు సహకరించాలని విజయనగరం పార్లమెంట్‌ ఇండియా వేదిక మద్దతు అభ్యర్థి బొబ్బిలి శ్రీను కోరారు . శనివారం విజయనగరం దాసన్నపేటలో ప్రచారం చేపట్టారు. పలు రంగాల కార్మికులను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్మిక సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సిపిఐ నాయకులు పి.కామేశ్వరరావు ఉన్నారు.

➡️