నీటి పథకాల పరిరక్షణ గాలికి..

ప్రజాశక్తి – చాపాడు మండల పరిధిలో పలు గ్రామాలలో మంచినీటి పథకాలను గాలికి వదిలేశారు. నెలలో ఒకసారి కూడా వాటిని శుభ్రం చేయడం లేదు. గతంలో పంచాయతీల ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి మంచినీటి పథకాలను శుభ్రం చేసేవారు. ప్రస్తుతం నెలల తరబడి వాటిని పట్టించుకునే నాధుడు కరువయ్యారు. మంచినీటి పథకాలకు తీగజాతి వ్యర్ధ మొక్కలు అల్లుకుపోతున్నాయి. అంజిరెడ్డి పథకాల ద్వారా సరఫరా అయ్యే నీటిలో కూడా వ్యర్థ పదార్థాలు అధికంగా వస్తున్నాయి. వీరభద్రపురం వద్ద మంచినీటి పథకానికి చుట్టూ మొక్కలు ఏపుగా పెరిగి పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. చండ్లూరు వద్ద ఉన్న మంచినీటి పథకం కూడా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అసౌకర్యంగా ఉన్నది. డైరెక్ట్‌ పంపిన ద్వారా జరిగే గ్రామాలలో సమస్య లేదు కానీ మంచినీటి పథకాల అందుబాటులో ఉన్న గ్రామాల్లో నీరు పరిశుభ్రంగా లేదని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం మంచినీటి పథకాలను తరచూ శుభ్రం చేయించేవారు. సర్పంచులకు నిధులు సరిగా మంజూరు కాకపోవడంతో మంచినీటి పథకాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అన్ని గ్రామాలలో మంచినీటి పథకాలను శుభ్రం చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌తో నీటిని శుభ్రం చేయిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది మంచినీటి పథకాలకు చుట్టూ శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

➡️