మైపర్‌లో ఘనంగా కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు

Nov 26,2023 15:24 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు ఏ క్యాంప్‌లో గల మైపర్‌ ఫార్మసీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలను వేసి అంబేద్కర్‌ గారి కషి రాజ్యాంగ నిర్మాణంలో గుర్తు చేసుకున్నారు. అనతంరం విద్యార్థులకు కాన్స్టిట్యూషన్‌ యొక్క ప్రాధాన్యతను కాన్స్టిట్యూషన్‌ నుండి ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతున్నామన్నది క్లుప్తంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.రవికుమార్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కాసర్ల సురేష్‌ ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️