శాంతిపురంలో సిపిఐ ప్రచారం

సిపిఐ ప్రచారం

 

ప్రజాశక్తి -గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల మంగళవారం ఎన్‌ఎస్‌టిల్‌, శాంతినగర్‌ అపార్టుమెంట్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల మనుగడకు, అధికధరల నియంత్రణకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాలని వివరించారు. నిరంతరం ప్రజా పక్షాన ఉంటూ వామపక్ష పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయని, వీటిని ఓటర్లు గమనించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి.చంద్రశేఖర్‌, రాజన దొరబాబు, ఎమ్‌డి బేగం, సుబ్బలక్ష్మి, నల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రచారం చేస్తున్న అత్తిలి విమల తదితరులు

➡️