సిపిఎం ముమ్మర ప్రచారం

Apr 20,2024 21:05

ప్రజాశక్తి – కురుపాం : రానున్న సార్వత్రి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ అభ్యర్థించారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో ఉదయపురం, మొండెంఖల్‌ పంచాయతీల పరిధిలోగల పలు గిరిజన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రజలతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి మత హింసాలను సృష్టిస్తుందని విమర్శించారు. గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని బలహీనపరుస్తూ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కోత పెట్టి ఐటిడిఎ, జిసిసిలకు వస్తున్న నిధులు తగ్గించి గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి పథకంలో నిధులు కోత పెట్టిందని రాష్ట్ర విభజన హామీలను వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర వైసిపి ప్రభుత్వం కేంద్రానికి ప్రశ్నించేది లేదని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో తెలుగుదేశం, జనసేన జతకట్టాయని ఈ నేపథ్యంలో గిరిజనుల హక్కులు సాధించుకోవడానికి గిరిజన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి జీవో 3 సాధన కోసం ఉపాధి, విద్య, వైద్యం సక్రమంగా గిరిజనులకు అందాలంటే సిపిఎంతోనే సాధ్యమని కావున సిపిఎం పార్టీ అసెంబ్లీ, పార్లమెంటుఅభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె.అవినాష్‌, సిపిఎం నాయకులు పి.శంకర్రావు, ఎం.అడ్డమేశ్వరరావు, పి.వాసు, కె.ఈశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎ.అశోక్‌, బి.అనిల్‌ కుమార్‌, పువ్వల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.నామినేషన్‌ను విజయవంతం చేయాలి ఇండియా వేదిక మద్దతుతో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను ఈ నెల 23న నామినేషన్‌ వేయనున్నానని ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ కోరారు. శనివారం స్థానిక సిపిఎం పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నామినేషన్‌ ప్రక్రియ విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కురుపాం నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీల నాయకులు కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యల హాజరై విజయవంతం చేయాలని కోరారు.

➡️