మోడీ ఆగడాలు ఆగాలంటే ఎన్‌డిఎను ఓడించాలి : సిపిఎం

Apr 18,2024 00:10

మాట్లాడుతున్న‌సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను బిజెపి మోసం చేసిందని, మరోవైపు మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలని కుట్రలు పన్నిందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమికి బుద్ది చెప్పి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో సిపిఎం నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరాజు అధ్యక్ష తన బుధవారం నిర్వహించిన సమావే శంలో విజరుకుమార్‌ మాట్లాడారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజలకు చేసిందేమీ లేదని, పైగా పరిస్థితులను మరింత దిగజార్చిందని అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక తను దారిమళ్లించడానికి అయోధ్యలో రామమందిరం పేరుతో మత రాజకీ యాలు చేస్తోందన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని సైతం కార్పోరేట్‌లకు కట్టబెట్టేలా కుట్రలు చేసిందని విమర్శించారు. రైతులపై కాల్పు లు జరిపించిన హీన చరిత్రను ప్రధాని మోడీ మూటగట్టుకున్నారని దుయ్యబ ట్టారు. ఇప్పటికే రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్న బిజెపి ఈ సారి గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తోందని, వారి ఆగడాలను నిలువరించాలంటే ఎన్‌డిఎ కూటమిని ఓడించి ఇండియా వేదిక పార్టీలను గెలిపించాలని కోరారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాట సందర్భంలో రైతులకు మోడీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదని, ఉపాధి హామీకి నిధులు తగించి ఆ చట్టాన్నే నిర్వీర్యం చేస్తున్నారని, కూలీలకు 100 రోజుల పని కలగా మారిందని విమర్శిం చారు. కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లు గా మార్పు చేసి కార్మికుల హక్కులను హరించారని, జీఎస్టీలో రాష్ట్రాల పనుల్న వాటాను తగ్గించారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తు న్నారని విమర్శించారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న బిజెపి, దాని మిత్రపక్షాలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కె.రామా రావు, బి.నాగేశ్వరరావు, పి.అంజిరెడ్డి, పాపారావు, యాకోబు, సుబ్బారావు, ఖాదర్‌ మస్తాన్‌, రామిరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.

➡️