దాసు నీ అభ్యర్థత్వాన్ని పదిలపరుచుకో..?

Apr 4,2024 15:01 #ntr district, #TDP

ప్రజాశక్తి-గంపలగూడెం: స్వామి దాసు ముందు నీ అభ్యర్థత్వాన్ని పదిల పరచుకో అని గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు తెలిపారు. ఇటీవల స్వామిదాస్ గంపలగూడెం మండల పర్యటనలో భాగంగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు సీటు ఖరారు కాదంటూ, వ్యంగ్యస్త్రాలు సంధించారని ఆరోపించారు. గురువారం ఈ విషయమై నాయకులు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో నీ అభ్యర్థిత్వం ఏంటో ప్రశ్నించుకోవాలని స్వామిదాస్ ను ఉద్దేశించి, అన్నారు. మాట్లాడేటప్పుడు ముందు, వెనుక, చూసి నిజాలు తెలుసుకొని, మాట్లాడితే గౌరవం ఉంటుందని వివరించారు. ఏప్రిల్ నెలలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందాల్సిన పింఛన్లు ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులచే ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్లు చెప్పారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఫలితంగా, పింఛన్ బాధితులు బాధపడుతున్నట్లు, అధికార వత్తాసు పత్రికల్లో వార్తలు వ్రాయించుకోవడం సరి కాదన్నారు. మండల పార్టీ అధ్యక్షులు రేగళ్ల వీరారెడ్డి, చెరుకూరి రాజేశ్వరరావు, బూరుగు నారాయణ, ఇనుగంటి రాంబాబు, వేముల బాలయ్య, జంగా చెంచు రెడ్డి, ఎం ఆర్ కె, కాజా రవికుమార్, గువ్వల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్త రజనీకాంత్ లు పాల్గొన్నారు.

➡️