పంట నష్ట పరిహారం చెల్లించాలి : ప్రజాప్రతినిధులు

Dec 9,2023 13:29 #anakapalle district
demand for crop damage exgratia

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల పరిధిలోని పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రజా ప్రతినిధిలు అన్నారు. స్థానిక మండల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నీయ్య నాయుడు, జెడ్ పి టి సి శ్రీధర్ రాజా మాట్లాడుతూ ప్రతి రైతుకు నష్టపరిహారం రావడానికి ఆధికారులు పరిశీలించాలని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లివిల్లి శ్రీనివాసరావుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి, నమ్మి మీనా ఆధికారులు పాల్గొన్నారు.

➡️