అట్టహాసంగా పింఛన్ల పంపిణీ

Jul 1,2024 21:38

ప్రజాశక్తి విలేకర్ల బృందం  : బొబ్బిలి పట్టణంలోని 17వ వార్డులో ఎమ్మెల్యే బేబినాయన పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌, కౌన్సిలర్‌ బి.శ్రీదేవి, నాయకులు కె.బంగారురాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి పాల్గొన్నారు. దిబ్బగుడ్డివలసలో ప్రభుత్వం పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే బేబినాయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సత్యనారాయణ ఎంపిటిసి సభ్యులు నాగరాజు పాల్గొన్నారు.

బాడంగి : మండలంలోని కోడూరు, బాడంగి గ్రామాల్లో పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే బేబినాయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, టిడిపి నాయకులు కొల్లి అప్పలనాయుడు, మరిపి రమేష్‌, గోవింద్‌, వైస్‌ ఎంపిపి భాస్కర్‌రావు, ఎంపిటిసి శ్రీను, ఎంపిడిఒ ఆంజనేయులు, బొంతు త్రినాథ్‌, సత్యం పాల్గొన్నారు.

తెర్లాం : మండలంలోని తెర్లాం, వెలగవలస, కూనాయవలస గ్రామాల్లో ఎమ్మెల్యే బేబినాయన పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, టిడిపి మండల అధ్యక్షులు ఎన్‌.వెంకట్‌ నాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఎన్‌.వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ శశి భూషణ్‌ రావు పాల్గొన్నారు.

రామభద్రపురం : కొట్టక్కి, ఆరికతోట గ్రామాల్లో పింఛన్లను ఎమ్మెల్యే బేబినాయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు పల్లా చంద్రరావు, కర్రోతు తిరుపతిరావు, సంగిరెడ్డి ప్రసాద్‌, బేత స్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా పింఛన్ల పంపిణీ

శృంగవరపుకోట : మండలంలో పెంచిన పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించారు.

వేపాడ : మండలంలోని సోంపురం, పాటూరు, బొద్దాం గ్రామాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, నాయకులు పాల్గొన్నారు. కొత్తవలస : పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు గొరపల్లి రాము, గొరపల్లి సుజాత, బొబ్బిలి అప్పారావు, కోరుపోలు అప్పారావు, మూర్కూరి తాత పాల్గొన్నారు.

బొండపల్లి : మండలంలో ఒంపల్లిలో పింఛన్ల పంపిణీని గంట్యాడ మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు పాలాభిషేకం చేశారు.సంతకవిటి : సంతకవిటిలో సోమవారం ఎమ్మెల్యే కోండ్రు మురళీ పింఛన్లను పంపిణీ చేశారు. టిడిపి మండల అధ్యక్షులు గట్టి భాను, వల్లూరు గణేష్‌, ఎంపిడిఒ, కార్యకర్తలు పాల్గొన్నారు.

డెంకాడ: మండలంలోని అక్కివరం గ్రామంలో ఎమ్మెల్యే లోకం మాధవి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. పెదతాడివాడలో పంపిణీ కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కంది చంద్రశేఖర రావు, పల్లె భాస్కర్‌ రావు, కలిదిండి పాణీరాజు, కంది సూర్యనారాయణ, పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. డి. తాళ్లవలసలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు పింఛన్లను పంపిణీ చేశారు.

నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీలో నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జులు కర్రోతు బంగార్రాజు, కిమిడి నాగార్జున, మండల అధ్యక్షులు ఆనంద్‌కుమార్‌, అధికార ప్రతినిధి గేదెల రాజారావు చేతులు మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు. టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ బంగారు సరోజినీ, తహశీల్దార్‌ ధర్మరాజు, ఎంపిడిఒ రామారావు, నాయకులు అవనాపు సత్యనారాయణ, నల్లి చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

మెరక ముడిదాం : మండలంలో తొలిరోజు పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తయిందని ఎంపిడిఒ పావని తెలిపారు. వైస్‌ ఎంపిపి కందుల పార్వతి తనకు పింఛన్ల పంపిణీపై సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గరివిడి: మండలంలోని బిజెపాలెంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గుర్ల: టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామమల్లిక్‌ నాయుడు గుర్ల గ్రామంలో పింఛన్లను పంపిణీ చేశారు. టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెన్నె సన్యాసి నాయుడు, కిరణ్‌ కుమార్‌, టిడిపి మండల అధ్యక్షులు చలుమల మహేష్‌, కిలారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భోగాపురం: మండలంలోని సవరవల్లిలో నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజుతో కలసి ఎమ్మెల్యే లోకం మాధవి పింఛన్ల పంపిణీ చేశారు. పోలిపల్లిలో టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, భోగాపురంలో జనసేన పార్టీ నాయకులు కాకర్ల పూడి శ్రీనివాసరాజు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. నాయకులు పల్లంట్ల జగదీష్‌, పళ్ళ రాంబాబు, బొడ్డ హరిబాబు, సంగం అప్పలసూరి గొడ్ల లక్ష్మణరావు, పసుపులేటి లోకేష్‌, మైలపల్లి నరసింహులు, అప్పలకొండ, గుండపు సూరిబాబు, న్యాయవాది సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️