విద్యార్థులకు పలకలు పంపిణీ

Jul 2,2024 21:54
విద్యార్థులకు పలకలు పంపిణీ

పలకలు పంపిణీ చేస్తున్న దృశ్యంవిద్యార్థులకు పలకలు పంపిణీప్రజాశక్తి-కోవూరు:బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడుగ్రామంలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక గిరిజన పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు బుచ్చిరెడ్డిపాలెం సహారా ఎడ్యుకేషనల్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ వారి ఆధ్వర్యంలో నోట్‌ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి పివి రత్నం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుటకు నిరుపేదలకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. యూనిఫారాలు, బూట్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. మీరందరూ బాగా చదువుకోవాలన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అమ్మ ఒడి పథకం కూడా లభిస్తుందన్నారు. సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ పేదలకు ఆస్తి అనేది చదువు ఒక్కటేనన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి మీ ఊరికి మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. గత 20సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు. మాకు ప్రతి కార్యక్రమానికీ దాతల ద్వారా సహకరించి చేస్తూ ఉంటామన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు విజయ కుమార్‌ సంస్థ తరపున అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమేష్‌, రాజ్యలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️