కలెక్టర్‌ను కలిసిన డిఎంహెచ్‌ఒ

May 1,2024 21:28

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కె.విజయ పార్వతి కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ను బుధవారం కలెక్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్‌ బగాది జగన్నాథ రావు మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన సంగతి విదితమే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కె.విజయ పార్వతీ సీతంపేట డిప్యూటీ డిఎంహెచ్‌ఒగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌, అర్‌బిఎస్‌కె ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ రఘు కుమార్‌, ఎఫ్‌డిపి నోడల్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌ ఉన్నారు.

➡️