వైద్యులు నిత్య విద్యార్థిగా ఉండాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నేటి వైద్యులు నిత్య విద్యార్థిగా ఉంటూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవ సందర్బంగా భారత జాతీయ కళా సంస్క తి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్‌) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా చాఫ్టర్‌ కన్వీనర్‌ లయన్‌ కె.చిన్నపరెడ్డి స్థానిక మానస సమావేశ మందిరంలో సంస్థ సభ్యులైన వైద్యులందరినీ ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చికిత్స రంగంలో ఎన్నో మార్పులు, ఆధునిక పోకడలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గౌరవ అతిథి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సలీంబాష మాట్లాడుతూ తనకు వైద్య వ త్తిపై ఉన్న మక్కువే తన కుటుంబంలో ఇద్దరిని డాక్టర్లుగా తీర్చిదిద్దామన్నారు. లయన్‌ చిన్నపరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో ఎక్కువ మంది వైద్యులు ఉండడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం సీనియర్‌, శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ పుత్తా బాలిరెడ్డి, హోమియో వైద్యులు డాక్టర్‌ ఆర్‌.రంగనాథరెడ్డి, ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి, న్యూరో నిపుణులు డాక్టర్‌ జగదీశ్వర్‌రెడ్డి, సంప్రదాయ వైద్యులు డాక్టర్‌ యదుభూషణరావు, మానసిక వ్యాధుల నిపుణులు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, వైవీయూ పాలక మండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడారు. సందర్బంగా దాదాప 15 మంది వైద్యులను ఇంటాక్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇంటాక్‌ కో కన్వీనర్‌ పి.వి. సుబ్బారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలలో..ప్రజాశక్తి – కడప సిటీ కడప నగర శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్యతిథిగా కలశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.సురేఖ హాజరయ్యారు. వైద్యులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెల్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషుల ప్రాణాలను కాపాడగలిగేది వైద్యులేనన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ విజరు భాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ మనోజ్‌, ఫోరెన్సిక్‌ విభాగం డాక్టర్లు, అనాటమి విభాగం డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️