పవర్‌ప్లాంట్‌ మాకొద్దు

Apr 23,2024 21:13

వేపాడ : తమ గ్రామ పరిధిలో పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయొద్దని మారిక సర్పంచ్‌ పి.పెంటమ్మ ఆధ్వర్యాన గిరిజనులు మంగళవారం ఎస్‌.కోటలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామంలో సర్వే కోసం సిబ్బంది రాగా, వారిని గిరిజనులు అడ్డుకున్నారు. పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సర్వే చేయొ ద్దని కోరారు. గతంలో తమ భూమిని సర్వే చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తామని నమ్మించి, సుమారు 60 ఎకరాలను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేశారని తెలిపారు. తమ భూమిని వ్యాపారులు నానోలైటెడ్‌ కంపెనీ పేరిట మ్యుటేషన్‌ చేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.డిటి వివరణ ఈ విషయాన్ని డిప్యూటీ తహశీల్దార్‌ సన్యాసి నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, మారిక, వీలుపర్తి, కెజిపూడి పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ భూము లను సర్వే చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు ప్రయోజనం కలిగేలా సర్వే చేస్తున్నట్లు వివరించారు.

➡️