అమలు సాధ్యం కాని హామీలు నమ్మొద్దు

May 4,2024 21:19

ప్రజాశక్తి – నెల్లిమర్ల : అమలు సాధ్యం కాని హామీలను ఇస్తున్న కూటమిని నమ్మొద్దని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. శనివారం నగర పంచాయతీ పరిధి డైట్‌ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారా అని విమర్శించారు. అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి మోసపూరిత హామీలు నమ్మకుండా అమలు సాధ్యమైన హామీలిచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డికి, వైసిపికి పట్టం కట్టాలని కోరారు. ఈ ప్రచారంలో పూసపాటి రేగ ఎఎంసి ఛైర్‌పర్సన్‌ చిక్కాల అరుణ కుమారి, వైసిపి పట్టణ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, వైస్‌ చైర్మన్‌లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, నాయకులు బైరెడ్డి నాగేశ్వర రావు, లీలావతి పాల్గొన్నారు.మండలంలోని గొర్లిపేట, సీతారాముని పేట, కొత్త పేటలో ఎమ్‌పి అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ సురేష్‌ బాబు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని చంద్రశేఖర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పతివాడ సత్యనారాయణ, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, రేగాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.డెంకాడ: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు రొంగలి కనకసింహాచలం, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, ఎమ్మెల్యే కుమారుడు ప్రదీప్‌నాయుడు, డెంకాడ సర్పంచ్‌ పతివాడ గౌరి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి మద్దతివ్వండి : ఎమ్మెల్యే శంబంగిబొబ్బిలి: ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి పాలనకు ఓటుతో మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. మున్సిపాలిటీలోని పాత బొబ్బిలిలో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వైసిపిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే శంబంగి, ఆయన సోదరుడు వేణుగోపాల్‌, కుమారుడు శ్రీకాంత్‌, మాజీమంత్రి పెద్దింటి జగన్మోహన్‌రావు వేర్వేరుగా ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.వైసిపిలో 50 కుటుంబాలు చేరిక మండలంలోని ముత్తాయవలస గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి. వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పేదలే జగన్‌కు అండ బాడంగి : వ్యక్తిగత స్వార్థంతో నాయకులు పెత్తందారుల వైపు వెళ్లినా.. సంక్షేమ పథకాలు పొందిన పేదలు మాత్రం సిఎం జగన్‌కు అండగా ఉన్నారని విజయనగరం జిల్లా జెసిఎస్‌ కన్వీనర్‌ శంబంగి శ్రీకాంత్‌ అన్నారు. మండలంలోని పాల్తేరు గ్రామంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్న అప్పలనాయుడును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సంక్షేమ పథకాలు కావాలా? మోసపూరిత హామీలు కావాలా?మెరక ముడిదాం: గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒకరికి ప్రభుత్వ పథకాలు అందే పాలన కావాలా? ఎన్నికలు ముందు మోసపూరిత హామీలు ఇచ్చే నాయకుడు కావాలా? మీరే ఆలోచించుకోండని బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్‌ బొత్స సందీప్‌ అన్నారు. మండలంలోని భగీ రధపురం, జి.మర్రివలస, గోపన్నవలస, సోమలింగాపురం పంచాయతీలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులు వద్దకు వెల్లి కూలీలతో మాట్లాడారు. బొత్స సత్యనారాయణ మీ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మరసారి ఆయన్ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణ రాజు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌ కుమార్‌, క్రిష్ణ మూర్తిరాజు, సీతారామరాజు, తల చుట్ల హరిబాబు, బాలి బంగారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.చీపురుపల్లి: రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృధ్ధి జరగాలంటే వైసిపితోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండంలోని రామలింగాపురంలో గల చెరువుల వద్ద పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలతో వారు మాట్లాడారు. నిరంతరం ప్రజలకోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాలలో మమేకమై ఉంటున్న మంత్రి బొత్స సత్యనారాయణను, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలింగాపురం సొసైటీ మాజీ అధ్యక్షులు బెల్లాన త్రినాథరావు, ఇప్పిలి రాము, బెల్లాన రమణ, బెల్లాన లక్ష్మణ, గొర్లె రాఘవ పాల్గొన్నారు.అభివృద్ధిని చూసి ఓటేయండి: ఎమ్మెల్యే కడుబండివేపాడ : వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కోరారు. శనివారం మండలంలోని వీలుపర్తి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సిఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మరోసారి వైసిపికి ఓటేయాలని కోరారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, డిసిసిబి చైర్మన్‌ వివి చినరాము నాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం.కస్తూరి, ఎంపిపి సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గుబాబు, మాజీ సర్పంచ్‌ గోకాడ సత్యంనాయుడు, నాయకులు పాల్గొన్నారు

➡️