నాటక కళలను కాపాడుకోవాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రతి సంవత్సరం కందుకూరి వీరిలింగం పంతులు జయింతిని పురస్కరించుకుని ఈ నెల 16న నాటకరంగ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించుకోవడం విశేషం. ఈ సందర్భంగా కడప వైవీయూ పరిధిలోని సి.పి.బ్రౌన్‌ గ్రంథాలయం నిర్వహిస్తున్న కార్యక్రమంలో శ్రీ కష్ణ రాయభారం నుంచి సెంటర్‌ సీనులో కృష్ణుడిగా నటిస్తున్న ప్రముఖ రంగస్థల నటులు యస్‌. మధుబాబు నాటకరంగం అవశ్యకత గురించి ప్రజాశక్తికి తెలియజేశారు. భారత దేశం సంస్కతి సంప్ర దాయాలను ప్రతిబింబించే పౌరాణిక నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు, కులమతాలకు, స్త్రీ పురుషులకు అతీతంగా అందరూ ఒక చోట చేరి తిలకించి ప్రజలు చైతన్య వంతులను చేసే ఒక గొప్ప సంస్కృతి కల్గిందే నాటకరంగం అన్నారు. ప్రపంచంలో ఏ భాషకు లేనటువంటి గొప్ప ప్రత్యేకత తెలుగు పద్యనాటకరంగానికి ఉందని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికే కాక ప్రపంచ నాటక రంగానికే నాటక రంగం విశిష్టతను నేర్పించిన సురభి కళాకారులు పుట్టినది మన జిల్లాలోనే అన్నారు. తాను కడప నగరం, బుగ్గ అగ్రహారంలో నాగమ్మ, చిన్నమునెయ్య దంపతులకు జన్మించానని, 13వ ఏటనే నాటకాల మీద మక్కువతో 1992 – 1993 సంవత్సరంలో రామకృష్ణ అనే గురువు దగ్గర శిష్యునిగా చేరానని తెలిపారు. అప్పట్లో పౌరాణిక నాటకాలైన శ్రీకష్ణ తులాభారం నుంచి శ్రీకష్ణుడు, నారదుడు, గయోపాఖ్యానం నుంచి శ్రీకష్ణుడు, అర్జునుడు, రామాంజనేయ యద్దం నుంచి శ్రీ రాముడు, ఆంజనే యుడు, సత్య హరిశ్చంద్ర నుంచి నక్షత్రక, చింతా మణి నుంచి భవాని, వరూదిని నుంచి ప్రవ రాఖ్యుడు, తారాశసాంకం నుంచి చంద్రుడు, శ్రీ కష్ణ రాయభారం నుంచి శ్రీకష్ణుడు, సహ దేవుడు, తదితర పాత్రలను నేర్చుకుని నాట కాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నాటక రంగంలో నక్షత్రక, భవాని, శ్రీ కష్ణుడు వంటి పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఇప్పటికీ ఏడాదికి 40 వరకు నాటక ప్రదర్శనలు చేస్తున్నానని తెలిపారు. నంది, ప్రశంసా పత్రాలు పొంది నట్లు పేర్కొన్నారు. 2017వ సంవత్సరం ప్రభు త్వం నుంచి కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. వై.ఎస్‌. రాజ శేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు శత రూపాలు అనే కార్యక్రమం ద్వారా 30 రోజులు నాటక ప్రదర్శనలు చేశామని పేర్కొన్నారు. ప్రభు త్వం నాటక రంగాన్ని ప్రోత్సహితే మళ్లీ కళలపై ఆధారపడి జీవ నం సాగిస్తున్న కళాకారులను ప్రొచ్చాహించినట్లవుతుందని పేర్కొన్నారు.

➡️