అక్రమ లే ఆఫ్‌ ఉపసంహరించాలి

Feb 21,2024 22:37
అక్రమ లే ఆఫ్‌ ఉపసంహరించాలి

ప్రజాశక్తి-బిక్కవోలుబ్లూ క్రాఫ్ట్‌ గ్లూకోజ్‌ ఫ్యాక్టరీ అక్రమ లే ఆఫ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. బ్లూ క్రాఫ్ట్‌ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో రామకృష్ణారెడ్డి బుధవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది రోజుల క్రితం ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని వెంటనే బ్లూ క్రాఫ్ట్‌ ఉద్యోగులకు తాను అండగా ఉంటానని చెప్పారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులపై కక్షపురితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

➡️