అభివృద్ధికి రోల్‌ మోడల్‌ బాలయోగి

Mar 3,2024 23:24
అభివృద్ధికి రోల్‌ మోడల్‌ బాలయోగి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంఅభివద్ధికి, నాయకత్వానికి రోల్‌ మోడల్‌ లోక్‌సభ మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి నిలిచారని రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్‌ టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. బాలయోగి 22వ వర్థంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో బాలయోగి విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బాలయోగి ఒక నాయకుడిగా తెలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆప్తుడని అన్నారు. కార్యకర్తల భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ మాట్లాడుతూ ఎంత ఎత్తుకు దిగినా ఒదిగి ఉండాలని నేర్పించిన గొప్ప నాయకుడు బాలయోగి అని కొనియాడారు. చిన్న కుటుంబం నుండి వచ్చినా భారత దేశంలో అత్యున్నతమైన పదవిలో కూర్చున్నా ఆయనలో ఏనాడు హెచ్చించుకోవడం చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌ కుమార్‌, వర్రే శ్రీనివాసరావు, తలారి ఉమాదేవి, రాచపల్లి ప్రసాద్‌, కోసూరి చండీప్రియ, జవ్వాది మురళీకృష్ణ, కప్పల వెలుగు కుమారి, బొమ్మనమైన శ్రీనివాస్‌, ద్వారా పార్వతి సుందరి, తంగెళ్ల బాబీ, ఇన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ పాల్గొన్నారు.

➡️