దేశంలో మహిళలకు సముచిత స్థానం

Mar 9,2024 23:43
దేశంలో మహిళలకు సముచిత స్థానం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌భారతదేశంలో ఇదిహాస, పురాణ కాలాల నుంచీ మహిళలకు సముచిత స్థానం లభిస్తోందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. స్థానిక కంబాల చెరువు సమీపంలోని వై.జంక్షన్‌ వద్ద ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పూర్తి ప్రదాత’ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యవంత మైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలుగ చేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ స్పూర్తిగా నిలుస్తున్న ఐఎంఎ మహిళా విభాగం వైద్యులను అభినందించారు. ఆరోగ్య పరిరక్షణపై సమాజ అభివద్ధికి మహిళా చేరికను ప్రేరేపించండి అనే నినాదంతో ర్యాలీలో పాల్గొనడం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించే దిశగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. మహిళలు అన్ని రకాలుగా దఢంగా తయారు కావలసి ఉందన్నారు. ఆ దిశలో మహిళల శారీరక, మానసిక, ఆరోగ్య పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవ్వడం ద్వారా సాధికారిత సాధించడం సాధ్యం అన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించడంలో భాగస్వామ్యం కావాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలు చదువుకోవడం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ ర్యాలీలో రాజమండ్రి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్‌ గురుప్రసాద్‌, డాక్టర్‌ సాయి ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌వి.నరసింహారావు, డాక్టర్‌ డి.భాస్కర్‌ రాజు, డాక్టర్‌ డిఆర్‌సి.జోగారావు, డాక్టర్‌ కె.అరుణ కుమారి, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ ప్రేమలత, డాక్టర్‌ జి.కాంతి తేజ, డాక్టర్‌ జి.రాధిక పాల్గొన్నారు.

➡️