నగరంలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కవాతు

Mar 5,2024 00:05
కలెక్టర్‌

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
నగరంలో సోమవారం కంబాల చెరువు నుంచి లాలాచెరువు వరకూ సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు కవాతు నిర్వహించారు. ఈ కవాతులో కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి జగదీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఓటర్ల నమోదు, అవగాహన కల్పించడం, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, వివిధ బృందాల ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వంటి కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడటంతో పోలీసింగ్‌ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బలగాలు జిల్లాకి రానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిథిలో కవాతు నిర్వహిస్తామన్నారు. ఎస్‌పి జగదీష్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, అడిషనల్‌ ఎస్‌పి పి.అనిల్‌కుమార్‌, అడిషనల్‌ ఎస్‌పి ఎల్‌.చెంచిరెడ్డి, డిఎస్‌పి డి.ప్రభాకర్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ సూరి అప్పారావు, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️