ఫిబ్రవరి 10, 11న గోదావరి బాలోత్సవం

Jan 26,2024 00:03
ఫిబ్రవరి 10, 11న గోదావరి బాలోత్సవం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఫిబ్రవరి 10, 11వ తేదీలలో గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షుడు విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.తులసి తెలిపారు. నగరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజీ ప్రాంగణం ఈ కార్యక్రమానికి వేదిక కానుందని తెలిపారు. గోదావరి బాలోత్సవ్‌ ఆధ్వర్యంలో గణేష్‌ చౌక్‌ లోని ప్రెస్‌ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలోత్సవం ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ పి.తులసి మాట్లాడుతూ గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని జనవరి 27, 28వ తేదీల్లో నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్‌ జారీ చేశామని విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ఫిబ్రవరి 10, 11వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు. కల్చరల్‌, అకడమిక్‌ రెండు విభాగాల్లో 36 రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. రిజిస్ట్రేషన్‌ గడువు తేదీని ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించినట్టు తెలిపారు. రాజమండ్రి సిటీ, రూరల్‌, కడియం, సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లో దాదాపుగా 700 స్కూల్స్‌ ఉన్నాయని, అందరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వి నియోగం చేసుకోవాలని, తల్లి దండ్రులు చిన్నారులను ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నారు. అసోసియేట్‌ అధ్యక్షుడు కృష్ణకుమార్‌ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం కొత్తగూడెంలో ప్రారంభి ంచిన బాలోత్సవం కార్యక్రమం విశేష ఆదరణ చూర గొంటోందని అన్నారు. చిన్నారుల్లో మానసిక వికాసానికి దోహద పడుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రాజమహేంద్రవరంలో గోదావరి బాలోత్సవం నిర్వహించిన కార్యక్రమంలో 10 వేల మంది విద్యార్థులు హాజరై ఘనంగా విజయవంతం చేశారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా, తిరుమల విద్యా సంస్థల చైర్మన్‌ తిరుమలరావు అధ్యక్షునిగా పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారులుగా మరో 100 మందితో ఆహ్వానం సంఘం ఏర్పాటు చేసి బాలోత్సవం విజయవంతానికి కృషి చేస్తోందని తెలిపారు. నగరంలోని ప్రముఖులు, విద్యావంతులు, అభ్యుదయ, ప్రజాస్వామిక వాదులు అందరూ గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండగను జయప్రదం చేయడానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి బాలోత్సవం ఉపాధ్యక్షులు కామేశ్వర శర్మ, కార్యదర్శి పి.మురళీకష్ణ, కాశీవిశ్వనాథ్‌, దాసరి సాయిబాబు, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️