మార్చి 1న ఆపరేషన్‌ వాలంటైన్‌ రిలీజ్

Feb 22,2024 22:14
మార్చి 1న ఆపరేషన్‌ వాలంటైన్‌ రిలీజ్

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంమార్చి 1న ఆపరేషన్‌ వ్యాలంటైన్‌ సినిమా రిలీజ్‌ చేస్తున్నామని హీరో వరుణ్‌ తేజ్‌ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మిలటరీ మాధవరం వెళ్లి సైనికుల కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలోమ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి సినిమాకూ తాను రాజమండ్రి వస్తానని, తన అమ్మమ్మ పక్కనే ఉన్న నిడదవోలులో ఉంటారని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. ఆపరేషన్‌ వాలంటైన్‌ సినిమా సిఆర్‌పిఎఫ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ కథాంశంగా ఉంటుందని వివరించారు. పుల్వామా, బాలాకోట్‌ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులను మన సైనికులు ఎలా మట్టుబెట్టారనేది, మన వారిని ఎలా కాపాడారనేది సినిమాలో చూపించామన్నారు. లవ్‌ స్టోరీ, కామెడీ, కమర్షియల్‌ సినిమాలే కాక ఆర్మీ కష్టాలపై సినిమా తీయడం తనకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో మట్కా అనే సినిమా చేస్తున్నానని హీరో వరుణ్‌ తేజ్‌ వెల్లడించారు.

➡️