కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె

Jan 18,2024 12:55 #East Godavari
anganwadi workers strike 38th day eg

ప్రజాశక్తి-చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీలు సమస్యలుపై చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 38వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు కే లక్ష్మి మాట్లాడుతూ మేము చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనవని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అడుగుతున్నాం తప్ప మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు.ముఖ్యంగా ఆర్థికపరమైన జీతాల పెంపు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ అమలు, పెంక్షన్ ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్స్ అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు. దీర్ఘకాలంగా ఎంతో సేవ చేస్తున్న మమ్ములను ప్రక్కన పెట్టి, నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను చేయడం దారుణమన్నారు. ఇచ్చిన కోర్కెలు తీర్చకుండా అంగవాడీలుపై ఎస్మా ప్రయోగించడం, చాలా బాధాకరం అన్నారు ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి న్యాయపరమైన కోర్కెలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

➡️