38వరోజుకి చేరిన అంగన్వాడీలు నిరవధిక సమ్మె

Jan 18,2024 14:43 #Anganwadi strike, #East Godavari

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదారవరి) : గోకవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమస్యలపై చేస్తున్న సమ్మె 38వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు అంగవాడీలుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కంటే ఒక వెయ్యి ఇస్తానని ఇచ్చిన హామీని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుటీ, రిటైర్డ్‌ బెనిపిట్‌ పెంచమని అడుగుతున్నాం కానీ మేము గొంతెమ్మ కోర్కెలను అడగడం లేదన్నారు. 38 రోజులుగా మా సమస్యలు పై సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం అన్నారు. ఇప్పటికే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు వర్కర్స్‌,హెల్పర్స్‌ పాల్గొన్నారు.

➡️