పదో రోజుకు ఆశా వర్కర్ల దీక్ష

Jun 15,2024 23:55
పదో రోజుకు ఆశా వర్కర్ల దీక్ష

ప్రజాశక్తి – నల్లజర్లఆశా వర్కర్లను వేధిస్తున్న ఎఎన్‌ఎంను సస్పెండ్‌ చేయాలని పోతవరం పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరాహార దీక్ష శనివారం పదో రోజుకు చేరింది. ఆశా వర్కర్లు విధులను బహిష్కరించి పిహెచ్‌సి వద్ద బైఠాయించారు. వారు మాట్లాడుతూ వర్కర్స్‌ సమస్యలపై నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు సమస్యను పరిష్కరించకుంటే డిఎంహెచ్‌ఒ ఆఫీసును ముట్టడి చేస్తామని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో ఆశా వర్కర్ల నాయకులు జయమ్మ, లక్ష్మి, రత్నమాల, సౌదామణి, క్రాంతి పాల్గొన్నారు.

➡️