పర్యాటక రంగం అభివృద్ధికి కృషి

Jun 16,2024 22:52
పర్యాటక రంగం అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి – నిడదవోలుపర్యాటక రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సాంస్కతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ చెప్పారు. నూతనంగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పట్టణంలోని లయన్స్‌ ఆడిటోరియంలో ఆదివారం 38 అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంత్రి దుర్గేష్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీగా ఉంటానని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సంఘం, కిరాణా జనరల్‌ మర్చంట్స్‌, బ్రాహ్మణ సంఘం, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రమేష్‌, కేదశెట్టి రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️