అంగన్వాడీల సమ్మెతో 2వ రోజు దద్దరిల్లిన కలెక్టరేట్

Dec 13,2023 18:02 #East Godavari
eg anganwadi protest 2nd day

సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.

జనసేన, టిడిపి, పలు సంఘాల మద్దతు.

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడి మూత వేసి బొమ్మూరులో గల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున 3000 మంది చేరుకున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని పెద్ద ఎత్తున నినదించారు. రాజనగరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధర్నా శిబిరం వద్దకు విచ్చేసి తన మద్దతును తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని. రాష్ట్రంలో ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాడని, ఎన్నికల ముందుఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం అమలకు ఫోన్ కొంటామని అన్నారు, జనసేన రాజనగరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల బలరామకృష్ణ సంఘీభవం తెలిపి మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచని ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసిందని, రాష్ట్రంలో మళ్లీ జగనే రావాలని ప్రచారం జరుగుతుందని, చిరుద్యోగులకు, స్కీం వర్కర్లకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ మళ్ళీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని, పోరాటంలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో ఎన్నికలకు పోతున్న సమయంలో సైతమ్ అంగన్వాడీల సమస్యలు పరిష్కారంలో నేను మీసాలు ఎక్కిస్తుందని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్ని ముఖ్యమంత్రిగా చేసింది అంగన్వాడీలు స్కీం వర్కర్లు అన్న సంగతి మరువద్దని హితవు పలికారు. ఉద్యోగులు,కార్మికులు,ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు అందరి పైన తీవ్ర భారాలు మోపి, కనీసం వారికిచ్చే వేతనాలు పెంచే విషయంలో కనీసం కనికరంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం నటిస్తుందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే పోచమ్మ, జిల్లా ట్రెజరర్ ఎం వెంకటలక్ష్మి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రాజా,ఐద్వా జిల్లా అధ్యక్షులు ఏ జరిన షరీఫ్, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సుందర్ బాబు,బి రాజులోవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ మూర్తి, కర్రీ రామకృష్ణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు మాణిక్యంబ, కె. బేబీరాణి ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే అన్నామని, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భాస్కర్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ల అధ్యక్ష కార్యదర్శులు మాలతి, సుబ్బలక్ష్మి, బి. మార్త, దుర్గంబ,మార్త సుజాత, శారదా, సునీత,పుష్ప, రామాలక్ష్మి, టి.బి. లక్ష్మి పాల్గొన్నారు.

➡️