కడియం నుండి పార్లమెంట్ కు…

Jun 8,2024 16:42 #East Godavari

“గిరజాల తరువాత తంగెళ్ళ ”

ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం చట్ట సభలలో తన ప్రాధాన్యత చాటుకుంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడియం గ్రామానికి చెందిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం బాలు ) జనసేన నుండి కాకినాడ ఎంపీగా పోటీ చేసి 2 లక్షలు పైగా మెజార్టీతో అఖండ విజయం సాధించారు. మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామి నాయుడు తరువాత కడియం నుండి పార్లమెంట్ లో తెలుగువాణి వినిపించే సువర్ణావకాశం ఉదయ్ కి దక్కింది. కడియం నుండి రెండున్నర దశాబ్దాలు క్రితం బీజేపీ తరపున గిరజాల వెంకట స్వామి నాయుడు రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కూడా గిరజాల శాసనసభ్యునిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే కడియపులంక నుండి దివంగత పాఠంశెట్టి అమ్మిరాజు కూడా జనతా పార్టీ నుండి అసెంబ్లీకి వెళ్లిన చరిత్ర కూడా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టడం, ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ ఉండడం , పవన్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన కడియం కుర్రాడు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా స్థానం సంపాదించడం, అనూహ్య విజయం సాధించడంతో స్థానిక నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️